సీఎం కేసీఆర్ ను చీపురు, చెప్పులతో కొట్టాలి – వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ ను చెప్పులతో కొట్టాలంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ రైతుగోస ధర్నాలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. మీడియాతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర రెడ్డి ఒక mlc ఉన్నాడని.. వరి ధాన్యం కొంటున్నం కదా అని ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట అంటూ చురకలు అంటించారు.

టీఆర్ఎస్ ను ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడు అంట… తప్పులు చేస్తున్న కేసీఆర్ నీ దెంతో కొట్టాలని ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల. 17 లక్షల ఎకరాల్లో ధాన్యం వేయనీయ నందుకు కేసీఆర్ ను ఏ చీపురు తో కొట్టాలని.. రైతులను మోసం చేసిన కేసీఆర్ నీ ఏ చెప్పులతో కొట్టాలంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు వైఎస్ షర్మిల. స్థానిక ఎమ్మెల్యే కొడుకు చేసిన అరాచకం కి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే మీద ఆమె కొడుకు మీద చర్యలు తీసుకొనేందుకు మిమ్మలిని ఏ చీపురు తో కొట్టాలని మండిపడ్డారు వైఎస్ షర్మిల.