ఎమర్జెన్సీ వార్డు నుంచే KCR కు వార్నింగ్ ఇచ్చింది వైఎస్ షర్మిల. గౌరవ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. KCR మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారు.ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను, మా కార్యకర్తలను బందీలను చేశారని నిప్పులు చెరిగారు.
తీవ్రంగా కొట్టారు.అకారణంగా కర్ఫ్యూ విధించారు. ఇవన్నీ YSR తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు. మీ త్యాగాలను YSR బిడ్డ ఎన్నటికీ మరవదు.YSRపై మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారని ఫైర్ అయ్యారు.
YSR బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం KCR తరం కాదు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా YSR సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదన్నారు వైఎస్ షర్మిల. కెసిఆర్ చేతులో పోలీసులు కీలుబొమ్మలని విమర్శలు చేశారు.
గౌరవ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. KCR మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారు.ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను, మా కార్యకర్తలను బందీలను చేశారు. తీవ్రంగా కొట్టారు.అకారణంగా కర్ఫ్యూ విధించారు. ఇవన్నీ YSR తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు.
1/2 pic.twitter.com/700hmP614R— YS Sharmila (@realyssharmila) December 11, 2022