రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ

వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై వినతి పత్రం ఇవ్వనున్నారు షర్మిల. గవర్నర్ ను కలిసిన అనంతరం రాజభవన్ నుంచి నేరుగా షర్మిల పాదయాత్రకు బయలుదేరి వెళ్ళనున్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆగిన చోట నుంచే ప్రజాప్రస్థానం పాదయాత్ర మళ్లీ మొదలు కానుంది. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి రేపు వైఎస్ షర్మిల పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. అయితే గతంలో షర్మిలను అరెస్టు చేసిన తీరును గవర్నర్ తమిళ్ సై తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో షర్మిల అరెస్టుపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?