శివసేనకు బిగ్‌ షాక్‌..BRSలో చేరిన కీలక నేత

-

శివసేనకు బిగ్‌ షాక్‌ తగిలింది. BRSలో కీలక నేత చేరారు. మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహారాష్ట్ర బీడ్ జిల్లా కు చెందిన దిలీప్ గోరె, బుధవారం నాడు హైద్రాబాద్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో పార్టీలో చేరారు.

వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు. దిలీప్ గోరే..బీడ్ మున్సిపల్ మేయర్ గా గతంలో పనిచేశారు. ప్రస్థుతం శివసేన పార్టీ బీడ్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. వీరికి ఆ ప్రాంతంలో రాజకీయంగా గట్టి పట్టువుంది. వీరితో పాటు…మహారాష్ట్ర చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విద్యాధికుడు శివరాజ్ జనార్థన్ రావు భంగర్., బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు పలువురు బిఆర్ఎస్ లో చేరారు. చేరికల సందర్బంగా.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బిఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ జాదవ్ తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news