BRSకు షాక్.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు వెళ్లేందుకు జంప్ అయ్యేందుకు అయ్యారట. పార్టీ ఫిరాయింపులతో BRS ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే పలువురు హస్తం పార్టీలోకి జంప్ కాగా, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన BRSLP సమావేశానికి ఎమ్మెల్యేలు మాణిక్ రావు, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్, విజయుడు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో వారు కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది.
ఇక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గులాబీ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలవడం జరిగింది.మొన్నటివరకు జ్వరం బారిన పడిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారు.ఆక్టివ్ కాగానే వెంటనే సీఎంలు రేవంత్ రెడ్డిని కలిశారు సుధీర్ రెడ్డి. దాదాపు గంటకు పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సుధీర్ రెడ్డి సమావేశం అయ్యారట. తన ఇంట్లో శుభకార్యానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చారట సుధీర్ రెడ్డి. కానీ ఆయన గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరేందుకే రేవంత్ రెడ్డిని కలిసినట్లు చర్చ జరుగుతోంది.దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.