టీచర్ ను డిప్యూటేషన్ పై పంపొద్దంటూ విద్యార్థుల ధర్నా

-

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు మొదలైనప్పటి నుంచి చాలా చోట్ల విద్యార్థులు తమ టీచర్లు స్కూల్ నుంచి వెళ్లిపోతుంటే కంటతడి పెడుతున్నారు. ఏళ్ల తరబడి తమకు విద్యాబుద్ధులు నేర్పించి.. తమ భవిష్యత్కు బంగారు బాట వేసిన మాస్టార్లు తమను వీడి వెళ్లిపోతుంటే ఆ చిన్నారుల గుండెలు గుక్కపెట్టి ఏడుస్తున్నాయి. మాస్టారు మీరు వెళ్లొద్దు ప్లీజ్ అంటూ ఆయన వెంట పడి మరీ వెళ్లకుండా అడ్డుపడుతున్నారు.

తాజాగా సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇంకో మెట్టు ఎక్కి ఏకంగా ధర్నాకు దిగారు. ఆ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని డిప్యూటేషన్పై ఇతర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను పంపించొద్దంటూ విద్యార్థులు వారితో పాటు తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఉపాధ్యాయురాలు  ఎంతో కృషి చేస్తున్నారని.. డిప్యూటేషన్ పై మరొక పాఠశాలకు పంపించడం సబబు కాదని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news