సింగరేణి అప్పుల్లో కూరుకుపోయింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎలా కొంటుంది – కిషన్ రెడ్డి

-

సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిలో కేసీఆర్ కుటుంబ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. ఇప్పటికే సింగరేణి సంస్థ అప్పులలో కూరుకుపోయిందని.. ఆ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎలా కొనుగోలు చేస్తుందని ప్రశ్నించారు. సింగరేణి కి మొత్తం వడ్డీతో కలిపి 25 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఇదో ఎలక్షన్ స్టంట్ గా పేర్కొన్నారు. సింగరేణి అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సింగరేణి బిఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. చివరకు కార్మికుల డ్యూటీ షిఫ్టింగ్ మార్చాలన్నా అధికార పార్టీ నాయకుల జోక్యం ఎక్కువైందన్నారు. కల్వకుంట్ల కుటుంబం రాజకీయ జిమ్మిక్కులు చేస్తుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని దేశమంతా విస్తరిస్తామని, ఇతర దేశాలలో కూడా బొగ్గు గనులను లీజుకు తీసుకుంటామని, అంతర్జాతీయంగా సింగరేణిని విస్తరిస్తామని చెప్పిన కేసీఆర్.. 9 ఏళ్ల అయినా హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news