నిన్న హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ మార్ క్రామ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అలా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయిన విధానం అయితే సన్ రైజర్స్ అభిమానులకు బాధ కలిగించే విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఆఖరి మూడు ఓవర్ లలో అబ్దుల్ సమద్ గెలిచే మ్యాచ్ ను సైతం తన స్లో బ్యాటింగ్ తో ఓటమి చెందేలా చేశాడు. ఇతను మొత్తం 12 బంతులు ఆడి కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
స్వతహాగా సమద్ హిట్టర్ గా జట్టులోకి వచ్చాడు, అయితే అటువంటి ప్రదర్శన అయితే ఏమీ చేయలేకపోయాడు. షాట్ ఆడే బంతులను సైతం సింగిల్ తీయడం లేదా డాట్ చేయడం చేస్తూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. నాకు తెలిసి సన్ రైజర్స్ తరపున సమద్ కు ఇదే ఆఖరి మ్యాచ్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే.