TSPSC పేపర్ లీకేజీ.. కమిషన్​లోని 40మంది సిబ్బందికి సిట్​ నోటీసులు

-

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులోసిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో  నిందితులను సిట్​ ఐదో రోజు ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో టీఎస్​పీఎస్సీకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల నుంచి మంగళవారం కీలక సమాచారం రాబట్టిన సిట్​ అధికారులు.. ఇవాళ కూడా అదే రీతిలో కొత్త విషయాలు తెలుసుకున్నారు.

ఈ కేసులో తాజాగా టీఎస్​పీఎస్సీ కమిషన్​లోని దాదాపు 40 మంది సిబ్బందికి సిట్​ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కమిషన్​లోని మొత్తం 10 మంది ఉద్యోగులు పరీక్ష రాసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే గ్రూప్​-1 పరీక్ష రాసిన ఉద్యోగులతో పాటు మిగిలిన వాళ్లకు కూడా నోటీసులు అందించారు. ఈ గ్రూప్​-1 పేపర్​ లీకేజీతో నిందితులు బాగానే లబ్ధి పొందినట్లు సిట్​ బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.

నిందితులు ఎవరెవరికి కాల్స్​ చేశారనే కోణంలో దర్యాప్తు చేసిన సిట్​ అధికారులకు.. రేణుక, ఢాక్యానాయక్​లు పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు అనుమానిస్తున్నారు. అయితే రేణుకా కాల్​ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్​ అధికారులు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news