కేసీఆర్ నిర్లక్ష్యంతోనే SLBC ప్రాజెక్టు పూర్తి కాలేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం పై నెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  కృష్ణా, గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతీ అంశం రాసిందని గతంలో పలుమార్లు కేసీఆర్ చెప్పారు. విభజన చట్టం ప్రకారమే.. ప్రాజెక్టులు అప్పగించడం జరిగింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీశ్ రావులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో  వివరించారు. 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సగం పూర్తి అయిన SLBC ప్రాజెక్టును వదిలివేసిన కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి.. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన 50 శాతం వాటా గురించి కేసీఆర్ ఎందుకు అడగలేదు అని ప్రశ్నించారు. 2022 కేఆర్ఎంబీ మీటింగ్ లో సంతకం ఎలా చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news