గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం పై నెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణ, గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతీ అంశం రాసిందని గతంలో పలుమార్లు కేసీఆర్ చెప్పారు. విభజన చట్టం ప్రకారమే.. ప్రాజెక్టులు అప్పగించడం జరిగింది. కేటీఆర్, హరీశ్ రావులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.
లెక్క ప్రకారం.. వాస్తవానికి 512 టీఎంసీలు తెలంగాణకు రావాలి. కానీ కేసీఆర్ తప్పిదం వల్ల కేవలం తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే వాటాలో వస్తున్నాయి. ఆంధ్రాకు మాత్రం 512 టీఎంసీలు వస్తున్నాయి. 2019లో మరీ బరితెగించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల పాపాలకు అంతే కాలేదు. చట్టం రూపొందించినప్పుడు కేసీఆర్ లోక్ సభలో, కేకే రాజ్యసభలో ఉన్నారు. 2015లో ఇరు రాష్ట్రాల సీఎంలతో కేఆర్ఎంబీ సమావేశం జరిగిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.