మేం తలుచుకుంటే పాకిస్తాన్ లోనూ శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తాం – సోయం బాపురావ్

-

ఆదిలాబాద్ : బీజేపీ ఎంపి సోయం బాపు రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తుండగా పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఆ ఇద్దరు యువకులను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. ఉరి తీస్తారా లేక మాకు అప్పిగిస్తారా.. అప్పగిస్తే మేము ఉరి తీస్తామని హెచ్చరించారు బీజేపీ ఎంపి సోయం బాపు రావ్.


తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడస్తుందని నిప్పులు చెరిగారు. హిందూ పండుగలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి వస్తుందని కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము తల్చు కుంటే పాకిస్తాన్ లో సైతం శ్రీరామ నవమి నిర్వహిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపి సోయం బాపు రావ్. ఈ వ్యాఖ్యలను శ్రీరామ నవమి శోభాయాత్రలో ఎంపి సోయం బాపురావ్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news