స్పీకర్ తనకి తండ్రి లాంటి వాడని అన్నారు బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ధర్మంగా ఉండే స్పీకర్ ని అడ్డంగా పెట్టుకుని టిఆర్ఎస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్పీకర్ ను అగౌరవ పరుస్తోంది మీరే.. క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు మీరు అంటూ మండిపడ్డారు. మీ బెదిరింపులకు మేము భయపడం, రాజీ పడం అని అన్నారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు ఈటెల రాజేందర్.
స్పీకర్ ని అవమానించేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. తనను అసెంబ్లీకి రాకుండా చేయాలని కెసిఆర్ చూస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అన్ని పార్టీల ఎమ్మెల్యేల హక్కులను కాపాడాలని కోరారు. బీఏసీ సమావేశంలో నిబంధనల కంటే సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలని ఈటెల రాజేందర్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం నేర్పుతాయని ఈటెల చెప్పారు.