బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. నేడు బంగారం, వెండి ధరల్లో పెరుగుదలలు లేవు. బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. అలాగే వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న రూ. 320 వరకు తగ్గిన బంగారం ధరలు.. నేడు నిలకడగా ఉంది. అలాగే వెండి ధరలు నిన్న రూ. 100 పెరగగా.. నేడు కిలో గ్రాము వెండిపై రూ. 400 వరకు తగ్గింది.
గత వారం రోజుల నుంచి కిలో గ్రాము వెండి ధర పై రూ. 1,600 వరకు తగ్గింది. అలాగే రూ. 500 వరకు ధరలు పెరిగింది. మొత్తంగా ఈ వారం కిందటితో పోలిస్తే.. రూ. 1,100 వరకు తగ్గింది. కాగ నేటి మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ లోని హైదరాబాద్, ఆంధ్ర ప్రదేవ్ లోని విజయవాడ నగరాల్లో 10 గ్రాముల బంగారం.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,140 వద్ద స్థిరంగా ఉంది. అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 71,000 గా ఉంది.