కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకుంటున్నారా ?ఇలా చేయండి.

-

కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన్‌ క్లాసులు పెరిగాయి. అయితే, దీనివల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది.పేద, మధ్య తరగతి ప్రజలకు కరెంట్‌ బిల్లు అనేది చాలా ముఖ్యమైన అంశం. కానీ, దీన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.

  • తరచూ లైట్లు, ఫ్యాన్లు వేయకండి. అవసరం లేనివి ఆఫ్‌ చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఇంట్లో ఉన్నవాళ్లందరికీ ఈ విషయం గురించి వివరించాలి.
  • అవసరం లేనపుడు టీవీ, కంప్యూటర్‌ను ఆఫ్‌ చేయాలి. దీని వల్ల 40 శాతం వరకు విద్యుత్‌ ఆదా అవుతుంది. అదేవిధంగా మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టి వాటిని అలాగే వదిలేయకూడదు. ఛార్జింగ్‌ అయిన వెంటనే పూర్తిగా తీసివేయాలి. కొంతమంది రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేస్తారు. దీనివల్ల కూడా ఎక్కువ విద్యుత్‌ ఖర్చు అవుతుంది.
  • ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి సరిపోయే లైట్లను మాత్రమే ఆన్‌ చేయాలి. దీన్ని వల్ల కరెంట్‌ వినియోగం తగ్గడంతో పాటు ఇతరులకు ఇబ్బంది ఉండదు.
  • ముఖ్యంగా ఇంట్లో వాడే బల్బులు, లైట్లను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఆర్డినరీ బల్బులకు బదులుగా తక్కువ విద్యుత్‌ వినియోగంతో కూడిన వాటిని వాడితే.. 60 శాతం వరకు విద్యుత్‌ ఆదా అవుతుంది.
  • ఎయిర్‌ కండీషనర్‌ను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఏసీని ఎప్పుడూ 25 డిగ్రీల్లో ఉండేలా జాగ్రత్త పడాలి. దీని వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news