హైదరాబాద్: ఉత్తరమధ్య ప్రదేశ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో మరింత బలహీనడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 48 గంటలు అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బికనూర్ జిల్లా జైపూర్ ప్రాంతం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ భాతరదేశంపై బలహీనంగా నైరుతి రుతు పవనాలు ఉన్నాయి. ఉత్తర, ఈ శాన్య భారతంపై నైరుతి రుతుపనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయి.
దీంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 13 వరకు తెలంగాణలో ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.