నేడు సుల్తాన్‌పూర్ మెడిక‌ల్ డివైజెస్ పార్క్ ప్రారంభం

వైద్య ప‌రిక‌రాల‌ను ఉత్ప‌త్తి చూయ‌డానికి ప్ర‌త్యేకం గా సంగరెడ్డి జిల్లా లోని సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన మెడిక‌ల్ డివైజెస్ పార్క్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ పార్క్ లోని 7 ఫ్యాక్ట‌రీల ను ఈ రోజు ప్రారంభిస్తారు. కాగ ఈ విష‌యాన్ని తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక గా ప్ర‌క‌టించారు. నేడు తెలంగాణకు గొప్ప రోజు అని కేటీఆర్ అన్నారు. ఈరోజు సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లో 7 ఫ్యాక్టరీలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.

ఈ ఫ్యాక్ట‌రీల‌ను ప్రారంభింస్తున్న‌ట్టు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాలుగు ఏళ్ల క్రితం శంకు స్థాప‌న చేశామ‌ని.. ఈ రోజు ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక పార్కుకు ఇది ఒక పెద్ద మైలురాయి అని అన్నారు. కాగ ఈ మెడిక‌ల్ డివైజెస్ పార్క్ దాదాపు 250 ఏక‌రాల్లో ఏర్పాటు చేశారు. 2017 లో ఈ మెడిక‌ల్ డివైజెస్ పార్క్ కు శంకు స్థాప‌న చేశారు. ఈ పార్క్ లో వైద్య పరికరాల ఉత్ప‌త్తి మాత్ర‌మే కాకుండా రీసెర్చ్, డెవ‌లప్ మెంట్ కూడా ఉండ‌బోతుంది.