కేటీఆర్ పై ఏపీ యువకుడి వీరాభిమానం.. ఆంధ్ర నుంచి తెలంగాణకు పాదయాత్ర

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి.. ఇప్పటి వరకు మంత్రి కేటీఆర్.. చేసిన సేవలకు.. మంచి పేరు వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రి కేటీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడు కావడంతో.. ఆయనకు మరో అడ్వాంటేజ్ లభించింది.

ఇది ఇలా ఉండగా మంత్రి కేటీఆర్ పై ఆంధ్ర యువకుడు వీరాభిమానం చాటుకున్నాడు. తన అభిమాన మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు ఆ యువకుడు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు కాలినడకన వెళ్లి కలవాలని నిర్ణయించుకుని నడక ప్రారంభించాడు. ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం మండలం సారథి గ్రామానికి చెందిన శేఖర్ కు మంత్రి కేటీఆర్ అంటే మీ అభిమానం. ” అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ కు వందనాలు” అనే ఫ్లెక్సీ తో నవంబర్ 30వ తేదీన తన గ్రామం నుంచి కాలినడకన బయలు దేరాడు శేఖర్. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ కు చేరుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన టిఆర్ఎస్ నాయకులు ఫిదా అయిపోయింది.