సీఎం రేవంత్ రెడ్డికి మరో షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

-

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కవిత బెయిల్ పై విడుదలైనప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా విమర్శిస్తూ ట్వీట్ చేసింది. బిజెపి – బీఆర్ఎస్ మధ్య ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని ట్వీట్ చేసింది. ” కమలంతో స్నేహం.. తైతక్కకు మోక్షం” అని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

అంతేకాదు కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా..? ఇందులో ఏది కరెక్ట్ అని ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కవిత బెయిల్ పై వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది.

అంతేకాదు కవిత బెయిల్ పై విడుదలైనప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడు రోజులు క్రితం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథ్ లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయవలసిన వ్యాఖ్యలేనా అంటూ వారు ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ట్వీట్లతో రేవంత్ రెడ్డి మెడకు మరో కేసు చుట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news