నేటి నుంచి తెలంగాణలో పంట నష్టాలపై సర్వే

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. నేటి నుంచి తెలంగాణలో పంట నష్టాలపై సర్వే చేయించనుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన నేటి నుంచి కొనసాగనుందని ఈ మేరకు మంత్రి తుమ్మల ప్రకటించారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Survey on crop losses in Telangana from today

తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని ఇప్పటికీ రైతులు జిల్లాల వారిగా నివేదిక తయారు చేస్తున్నారని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. ఇక ఆ నివేదిక అందిన వెంటనే రైతుల ఖాతాల్లో నష్టపరిహారాన్ని చేస్తానని ఈ మేరకు హామీ ఇచ్చారు.3 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.రైతు బంధు నిరంతర ప్రక్రియ అని, మార్చి నెలాఖరు అందరి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news