లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులకు ఈ నెల 23న టీడీపీ వర్క్ షాప్ ఉండనుంది. పోల్ మేనేజ్మెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు చంద్రబాబు నాయుడు. ఇక ఈ నెల 26 నుంచి చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభం అవుతుంది. 20 రోజుల పాటు రోజుకో పార్లమెంటు పరిధిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఉంటుంది.
చిత్తూరు లోక్ సభ నుండే ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభం అవుతుంది. 24, 25వ తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. అటు ఈ నెల 27 నుంచి రోడ్డెక్కనుంది వారాహి వాహనం. ఈ నెలాఖరు నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన ఉండనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ తరుణంలోనే…ఆంధ్రప్రదేశ్ రోడ్డెక్కనుంది వారాహి.