రేవంత్ కు షాక్‌…గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన యాదవ సంఘం

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యాదవ, కురుమలను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని… ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డికి వారు విధించిన డెడ్ లైన్ ముగియనుండటంతో వారు నిరసనను ఉదృతం చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈ రోజు గాంధీభవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే.. గాంధీభవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతలు బయలు దేరారు. ఈ తరుణంలోనే.. ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గొల్లకురుమలను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తలసానిపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గొల్లకురుమలు.

Read more RELATED
Recommended to you

Latest news