నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటి పథకాలను తీసుకువచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోకి నడ్డా, రాహుల్ గాంధీ టూరిస్టులుగా వచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్ లో రాష్ట్ర బడ్జెట్ ను స్టడీ చేసి హామీలు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని.. కేంద్ర పరిధిలో ఉంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పబ్లిసిటీ కోసం పర్మిషన్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్ నగర్ లో నడ్డా పర్యటనకు, వరంగల్ లో రాహుల్ గాంధీ సభకు పర్మిషన్లు ఇవ్వలేదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ యూపీలో 403 స్థానాలకు పోటీ చేస్తే కేవలం 2 సీట్లలో గెలుపొందిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
రాష్ట్ర బడ్జెట్ పై అవగాహణ ఉండే రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారా..?: తలసాని
-