అభివృద్ధి అంటే ఒకే కుటుంబం కోసం కాదు: తమిళిసై

-

గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్​కు మధ్య విభేదాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. ప్రగతి భవన్​కు, రాజ్​భవన్​కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు ఆహ్వానం పంపడం లేదు. ఈ క్రమంలో గవర్నర్​ కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. తాజాగా మరోసారి సర్కార్​పై తమిళిసై విమర్శలు గుప్పించారు.

అభివృద్ధి అంటే ఒకే కుటుంబం కోసం కాదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. కేవలం ఒక్క కుటుంబమే కాదు.. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. జీ-20 సమావేశాల్లో భాగంగా సి-20 సమాజ్‌శాల కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘కొంత మంది మాట్లాడుతారు కానీ పని చేయరు. దేశాధినేతలనైనా కలవొచ్చు.. ఈ స్టేట్‌ చీఫ్‌ని మాత్రం కలవలేం. నన్ను నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదు. ప్రగతి భవన్‌.. రాజ్‌భవన్‌ దూరంగా ఉంటున్నాయి’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news