ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2024 తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకో సారి వచ్చే ఈ జాతరకు సంబంధించి 2024 ఏడాదిలో తేదీలను పూజారుల సంఘం తెలిపింది. 2024లో ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు మేడారం మహా జాతర నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గుడి సమీపంలో ఉన్న కమిటీ హాలులో కుల పెద్దలు, పూజారులు సమావేశమై జాతర తేదీలను ఖరారు చేశారు.
- 21 ఫిబ్రవరి 2024న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి తీసుకువచ్చే కార్యక్రమం
- 22 ఫిబ్రవరి 2024న చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వస్తుంది
- 23 ఫిబ్రవరి 2024న భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు
- 24 ఫిబ్రవరి 2024న సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతల వన ప్రవేశం
28 ఫిబ్రవరి 2024న తిరుగువారం జాతరతో వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహా జాతర పూజలు ముగియనున్నట్లు పూజారుల సంఘం తెలిపింది.