త‌మ్మినేని కృష్ణ‌య్య హ‌త్య కేసులో 8 మంది నిందితుల‌కు రిమాండ్

-

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే.. సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు లో నిందితులను కోర్టుకు అప్పగించారు పోలీసులు. ఈ కేసులో బోడపట్ల శ్రీనివాసరావు, గజ్జి కృష్ణ, నూకల లింగయ్య,కన్నెగంటి నవీన్, బండారినాగేశ్వరరావు జక్కంపూడి కృష్ణయ్య, మల్లారపు లక్ష్మయ్య, ఎస్ కె రంజాన్ లను అరెస్టు చేశారు.

అయితే.. అరెస్ట్‌ అయిన ఈ 8 మంది నిందులకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఇది ఇలా ఉండగా.. తమ్మినేనికుటుంబానికి కృష్ణయ్య కు మధ్య విబేదాలు ఉన్నాయి. ఆ విభేదాల వల్ల ఈ హత్య జరిగినట్లుగా చర్చ సాగుతుంది. ఇదే విషయాన్ని తమ్మినేని కృష్ణయ్య బార్య మంగతాయారు, కూతురు రజిత లు స్పష్టం చేశారు.

కొడుకు నవీన్ కూడ పోలీసులకు పిర్యాదు లో అదే స్పష్టం చేశారు. దీంతో నవీన్ ఇచ్చిన పిర్యాదుమేరకు తమ్మినేని కోటేశ్వరరావును ప్రధమ ముద్దాయి గా ఆగస్టు 15న హత్య జరిగిన రోజున ఎప్ ఐ ఆర్ లో నమోదు చేశారు. అయితే నిన్న కోర్టుకు పంపిన రిమాండు రిపోర్టు లో మాత్రం తమ్మినేని కోటేశ్వరరావు ను పూర్తి గా తప్పించారు. దీంతో ఈ కేసులో రాజకీయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news