బెల్లంకొండ గణేష్, అవంతిక నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది.
సునీల్ సముద్రఖని కీలకపాత్రలో కనిపించనున్న ఈ మూవీని సతీష్ వర్మ నిర్మించారు. ఓ హత్య కేసుకు, హీరో ఫోనుకు ఉన్న సంబంధం ఏంటి, హీరో ఖాతాలో భారీగా డబ్బు వచ్చి ఎలా పడింది అనే విషయాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.