ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణపైనా చర్చించినట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిలు, ఇతర అంశాల్లో కేంద్రం వైఖరిపై చర్చ జరిపారు. పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపైనా ఈ సమావేశంలో చర్చించారని సమాచారం.
పలు చట్ట సవరణల బిల్లులపైనా మంత్రివర్గంలో చర్చలు జరిపారు. జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాల సవరణలపై చర్చించారు. జీహెచ్‌ఎంసీ కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ గురించి మంత్రివర్గంలో చర్చ జరిపారు. మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతుల మంజూరు అంశం సైతం ఈ భేటీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది అటవీ కళాశాల, పరిశోధనా సంస్థల్లో కొత్త కోర్సులు, పోస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది.