సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలి: అసదుద్దీన్ ఒవైసీ

-

సెప్టెంబర్‌ 17న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశామని తెలిపారు. తెలగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని గుర్తు చేశారు. తురేబాజ్‌ఖాన్‌ వీరోచిత పోరాటం చేశారని వివరించారు.

సెప్టెంబర్‌ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఎంఐఎం నిర్వహించే బహిరంగ సభలో పార్టీ ఎమ్మెల్యేలంతా పాల్గొంటారని అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడించారు. సెప్టెంబర్‌ 17 హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు అని తెలిపారు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని, అలాకాకుండా జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని కోరారు.

‘సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై సర్వే చేయాలి. ముందే ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో సర్వే చేయటం కాదు. అభివృద్ధి, ఆధునీకరణకు ఎవరూ వ్యతిరేకులు కాదు. జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తే మేం పాల్గొంటాం. విమోచన, సమగ్రత మధ్య చాలా తేడా ఉంది. అందరినీ భాగస్వాములను చేస్తూ జాతీయ సమైక్యతా దినం జరపాలి. 8 ఏళ్లుగా మోదీ సర్కారు ఎందుకు ప్రకటించలేదు. దేశంలో భాజపా ప్రభుత్వం నిజాం పాలనను గుర్తు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.’- అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంపీ

 

Read more RELATED
Recommended to you

Latest news