టీచర్ల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.   సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు  కోరుతున్న బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దంపతులను ఒకేచోటకు బదిలీ చేయాలని ఇటీవల టీచర్ల ఆందోళన చేపట్టారు.  దీనిపై స్పందించిన ప్రభుత్వం .. దంపతుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లో దంపతుల బదిలీలు చేయాలని నిర్ణయించింది. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవాళ్టి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుండగా… 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు  డీఈఓల సమావేశంలో కాలపట్టికను విద్యాశాఖ ఖరారు చేసింది. మొత్తం 37 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ 15 రోజులు అప్పీళ్లకు అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news