అంత‌రాష్ట్ర ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌..

-

లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. జ‌న‌తా క‌ర్ఫ్యూ కార‌ణంగా మార్చి 22 నుంచి అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌న్నీ ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే సుదీర్ఘ విరామం త‌ర్వాత అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు మ‌ళ్లీ రోడ్ల‌క్క‌నున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు మినహా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు సోమవారం నుంచి టీస్ ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు పున ‌ప్రారంభం కానున్నాయి. ఆయా రాష్ట్రాల్లో తిరిగే కిలోమీటర్ల విషయంలో స్పష్టత రాకపోవటంతో తెలంగాణ–ఏపీ మధ్య సర్వీసులు ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టనుంది.

కర్ణాటక, మహారాష్ట్రలతో వివాదం లేకపోవటంతో ఈ రెండు రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం సిటీ బస్సులతోపాటే వీటిని కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఆ రాష్ట్రాలు సంసిద్ధంగా లేకపోవటంతో ప్రారంభాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news