GHMC కార్మికులకు దీపావళి ఆఫర్ అందించింది తెలంగాణ సర్కార్. జిహెచ్ఎంసిలో దీపావళి సందర్భంగా ఒకరోజు ముందుగానే జీతాలు చెల్లిస్తున్నారు అధికారులు. దాదాపు 27,000 ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు 120 కోట్ల వరకు జీతాలు చెల్లించనున్నారు జిహెచ్ఎంసి అధికారులు. ఇప్పటికే బిల్లులు సిద్ధమైన వారందరికీ చెల్లింపులు చేస్తున్నారు అధికారులు.
జిహెచ్ఎంసిలో దీపావళి సందర్భంగా ఒకరోజు ముందుగానే జీతాలు చెల్లిస్తున్న తరుణంలోనే… GHMC ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు సంబర పడిపోతున్నారు. కాగా.. జనావాస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.
దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి..రాష్ట్రం మొత్తం మరియు జంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న గల్లిల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.