గవర్నర్ తమిళి సై రాజీనామా.. క్లారిటీ..!

-

తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళి సై సౌందర్య రాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ చెన్నై లేదా తిరునవేలి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధం అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 27న ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై ఎంపీ అభ్యర్థిత్వం కోసం కోరనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా తమిళి సై స్పందించారు. గవర్నర్ గా తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. ఏదైనా నిర్ణయం ఉంటే తెలియజేస్తామని చెప్పారు. తాను తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తలు కేవలం ప్రచారం అని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. ప్రధాని మోడీ, శ్రీరాముడి దయతో తాను గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. తాను ఢిల్లీ వెళ్లలేదని.. ఎవ్వరినీ రిక్వెస్ట్ చేయలేదన్నారు. తూత్తుకుడి వరదను చూసి వెళ్తే తప్ప ఎన్నికల్లో పోటీ చేయను అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news