హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో 95 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్‌ వాసులకు కేసీఆర్‌ సర్కార్‌ మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ మహా నగరంలో మరో 95 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకు రావాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న అసెంబ్లీ వేదికగా… తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు తన్నీరు హరీష్‌ రావు ప్రకటన చేశారు. నిన్న బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం.. బస్తీ దవాఖానాల ఏర్పాటు పై ప్రకటన చేశారు.

మరో మూడు నెలల్లోనే వీటి ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. బస్తీ దవాఖాల కారణంగా హైదరాబాద్ వాసులకు చాలా లబ్ది చేకూరుతుందన్నారు.  రూ.2 లక్షల 56 వేల 958 కోట్ల 51 లక్షలతో 2022 -23 తెలంగాణ బడ్జెట్‌ ను మంత్రి హరీష్‌ రావు ప్రవేశ పెట్టారు. అలాగే.. దళిత బంధు కోసం 17700 కోట్లు, ఎస్టీ సంక్షేమం 12 వేల 565 కోట్లు, బీసీ సంక్షేమం 5 వేల 698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 177 కోట్లు, కల్యాణ లక్ష్మీ, శది ముబారక్ లకు 2 వేల 750 కోట్లు, ఆసరా పింఛన్లకు 11 వేల 728 కోట్లు, డబల్ బెడ్రూం ఇళ్లకు 12 వేల కోట్లు బడ్జెట్ లో పెడుతున్నట్లు ప్రకటన చేశారు.