జీఎస్టీ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ.. కేంద్రం చెప్పినట్టే !

-

జీఎస్టీ పరిహారం విషయంలో కాస్త పట్టు సడలించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన మార్గంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది తెలంగాణా ప్రభుత్వం. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం సూచించిన రెండు మార్గాలను ఒప్పుకునే ప్రసక్తే లేదని తొలుత వాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. జిఎస్ టి వల్ల నష్టపోయిన మొత్తాన్ని కేంద్రమే భరించాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం దారిలోకి వెళ్ళింది.

కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన రెండు మార్గాల్లో తెలంగాణ ప్రభుత్వం మొదటి ఆప్షన్ ను ఎంచుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకి లేఖ రాసింది. దీంతో మొదటి మార్గాన్ని ఎంచుకున్న ఇరవై రెండు రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా చేరింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మొదటి మార్గాన్ని ఎంచుకుంది కూడా. ఇక తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్రం 2380 కోట్ల ప్రత్యేక రుణాన్ని పొందడమే కాకుండా జీఎస్డీపీలో పాయింట్ ఐదు శాతం అంటే ఐదు వేల పదిహేను కోట్ల దాకా అదనపు రుణాన్ని సమీకరించడానికి అనుమతి లభించినట్లు అయిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి లేఖ రాగానే అదనపు రుణానికి అనుమతి ఇచ్చామని ఈ ప్రత్యేక ఋణం నవంబర్ 23న లభిస్తుందని అధికారులు తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news