BREAKING : ABN ప్రసారాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. అవినాష్ రెడ్డి పిటిషన్ పై ABN ప్రసారాలపై హైకోర్టు సీరియస్ అయింది. న్యాయ వ్యవస్థ ను దిగజార్చే విధంగా ABN చేసిన ప్రసారాలపై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యారు.
ఈ వివాదంపై చీఫ్ జస్టిస్ ద్రుష్టికి తీసుకెళ్టారు జస్టిస్ లక్ష్మణ్. తీర్పు కాపీలో సైతం మెన్షన్ చేసిన జస్టిస్ లక్ష్మణ్… ABN ప్రసారాలపై సీరియస్ అయ్యారు. ఇది ఇలా ఉండగా,మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చేస్తే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలకు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని అవినాష్‌కు షరతు విధించింది.