నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

-

ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మంది హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం 4, 82,677 మంది.. ద్వితీయ సంవత్సరం 4, 65,022 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

మూల్యాంకన ప్రక్రియ సుమారు ఇరవై రోజుల క్రితమే పూర్తయింది. మార్కుల అప్‌లోడ్‌ వంటి ప్రక్రియ పూర్తి చేసి.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇవాళ ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తేదీలతో పాటు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ఇవాళ ప్రకటించనున్నారు.

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులంతా ధైర్యంగా ఉండాలని.. మార్కులు తక్కువ వచ్చినా.. ఫెయిలైనా ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మార్కులే జీవితం కాదని.. మరోసారి పరీక్షలు రాసి మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. అంతేగానీ తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news