తెలంగాణ ఆదాయ మార్గం వెతుకుతోంది.. రియల్ ఎస్టేట్ సరైనదేనా..?

-

కరోనా కారణంగా రాష్ట్రాలు ఆర్థికంగా చితికిపోయాయి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అన్ లాక్ దశలో ఉన్నప్పటికీ కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడం, ఆదాయాన్ని అందించే చాలా సంస్థలు ఇప్పటికీ ఓపెన్ కాకపోవడం మొదలగు అంశాల వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఇంకా ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అందువల్ల ఇక నుండి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం.

తాజాగా తెలంగాణ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగుతుందని వినిపిస్తుంది. ఇందుకోసం పెద్ద ఎత్తులో కసరత్తులు చేస్తుంది. ప్రభుత్వ భూములని గుర్తించి వాటిని స్వయంగా ప్రభుత్వమే అమ్మే విధంగా చర్యలు తీసుకోనుందట. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారట. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాదు, అక్రమంగా కబ్జాదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమి ఉపయోగకరంగా మారుతుంది.

ఆ విధంగా భూముల్ని కొన్నవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగవు. విన్ విన్ మూవ్ లాగా ఇటు ప్రభుత్వంతో పాటు అటు కొనుక్కున్న వారికి కూడా లాభం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ విషయమై చర్చలు జరుగుతున్నందున మరికొద్ది రోజుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారట. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద ఎత్తున మార్పులు సంభవించే అవకాశముంది. ఇష్టం వచ్చినట్టు భూముల రేట్లు పెరగడం లాంటివి ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చాక తగ్గే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఐతే ఆదాయం కోసం ప్రభుత్వమే వ్యాపారంలోకి దిగి, భూములని అమ్మడం కరక్టేనా అని చాలామందికి కలుగుతున్న ప్రశ్న..

Read more RELATED
Recommended to you

Latest news