రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారులు లోక్సభ పోరులో ఎంత మంది నామినేషన్ వేశారు? ఎన్ని సెట్లు వేశారో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 895 మంది 1488 సెట్ల నామినేషన్లు వేశారని అధికారులు తెలిపారు. మల్కాజిగిరిలో అత్యధికంగా 114 మంది వేసినట్లు చెప్పారు. ఆదిలాబాద్ లో అతి తక్కువగా 23 మంది నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు.
ఇక పెద్దపల్లిలో 63, కరీంనగర్ లో 53, నిజామాబాద్‌లో 42, జహీరాబాద్ లో 40, మెదక్ లో 54, సికింద్రాబాద్ లో 57, హైదరాబాదులో 57, చేవెళ్లలో 66, మహబూబ్ నగర్ లో 42, నాగర్ కర్నూల్ లో 34, నల్గొండలో 56, భువనగిరిలో 61, వరంగల్ లో 58, మహబూబాబాద్ లో 30, ఖమ్మంలో 45 మంది నామినేషన్లు వేశారని ఎన్నికల అధికారులు చెప్పారు. ఉపఎన్నిక జరుగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 24 మంది 50 నామినేషన్లు వేశారని తెలిపారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నేడు అధికారులు పరిశీలించనున్నారు. ఈనెల 29లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఁది. నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.