TSPSC అభ్యర్థులకు తెలంగాణ RTC శుభవార్త

-

TSPSC అభ్యర్థులకు తెలంగాణ RTC శుభవార్త. TSPSC ఆధ్వర్యంలో నేడు, రేపు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) పోస్టుల భర్తీకి రాతపరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

అభ్యర్థులు బస్సులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం కోఠి (ఫోన్:9959226160), రైత్ ఫైలి (ఫోన్:9959226154) బస్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్స్ సెంటర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

కాగా, సివిల్ విభాగంలో 1,343 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నేడు, రేపు రాతపరీక్షలు నిర్వహించనుంది. ఉ.10 గంటల నుంచి మ. 12:30 వరకు పేపర్-1, మ. 2:30 నుంచి సా. 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో జరగనున్నాయి. మొత్తం 1,540 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా… 197 ఉద్యోగాలకు ఈనెల 8, 9 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news