ఎల్ఐసీ పాలసీ.. అతి తక్కువ కాలంలోనే రూ.50 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు..

ఇండియాలోని అతి పెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ ప్రజాదారణ పొందింది.. ఇందులో వందల సంఖ్యలో స్కీమ్స్, లక్షల్లో వినియోగదారులు ఉంటారు..పాలసీదారులకు ఆయా స్కీమ్ లలో వచ్చే ప్రయోజనాలు అధికంగా ఉండటంతో అందరూ దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అలాంటి అధిక రాబడినిచ్చే పథకాలలో ఎల్ఐసీ బీమా రత్న పాలసీ ఒకటి. ఈ పాలసీలో మెచ్యూరిటీ నాటికి రూ.50 లక్షల రిటర్న్స్ పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఎల్ఐసీ బీమారత్న ప్లాన్ తీసుకున్నవారికి సేవింగ్స్‌పై మంచి రిటర్న్స్ రావడంతో పాటు మంచి భీమా రక్షణ కూడా ఉంటుంది.. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే ఆ డబ్బులను నామీనికి అందిస్తారు.. ఈ స్కీమ్ వివరాలిలా..

ఎల్ఐసీ బీమా రత్న పాలసీని కనీసం 90 రోజుల వయస్సు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వారికి 20 ఏళ్లు లేదా 20 ఏళ్ల టర్మ్ వర్తిస్తుంది. 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 5 ఏళ్లు ఉండాలి. కనీస మెచ్యూరిటీ వయస్సు 20 ఏళ్లు. కనీసం రూ.5,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉంటుంది. 25 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 21 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అలాగే 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక 15 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 11 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాలి..

టర్మ్ పాలసీలు కూడా ఒకసారి చెక్ చెయ్యాలి.. ఇక ఉదాహరణకు..ఓ వ్యక్తి 15ఏళ్ల కాల వ్యవధితో రూ. 5లక్షల అష్యూర్డ్‌తో ఎల్ఐసీ బీమారత్న పాలసీ తీసుకున్నాడనుకుందాం. అతనికి 13వ సంవత్సరంలో ఒకసారి, 14వ సంవత్సరంలో రెండోసారి 25 శాతం చొప్పున మనీబ్యాక్ వస్తుంది. దీంతో పాటు మొదటి ఐదేళ్లకు రూ.1,000 కి రూ.50 చొప్పున, 6 నుంచి 10 ఏళ్ల వరకు రూ.1,000 కి రూ.55 చొప్పున, ఆ తర్వాత మెచ్యూరిటీ వరకు వరకు రూ.1,000 కి రూ.60 చొప్పున బోనస్ వస్తుంది.. చివరికి రూ.50 లక్షల వరకు చేతికి వస్తుంది.. పన్ను మినహాయింపు కూడా ఉంది..