తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ చీరల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 352 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కెసిఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ఆడబిడ్డలకు చీరలను పంపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
18 సంవత్సరాల నుండి నా ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో సగటున ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఆడబిడ్డలకు ఈ చీరలు అందుతున్నాయి. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మొత్తం 400 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది. ఈ నిధుల్లో ఏకంగా 352 కోట్లను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేసీఆర్ సర్కార్.