తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి పగ్గాలు..!

-

తెలంగాణ బీజేపీలో కీలక మార్పుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన పార్టీ హై కమాండ్ రాష్ట్ర నాయకత్వంపైన దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్థానంలో మరో కీలక వ్యక్తిని నియమించనున్నట్లు సమాచారం. ఆ కీలక వ్యక్తి ఎవరో కాదు.. స్వయంగా కేంద్ర మంత్రి, సీనియర్ నేత కిషన్ రెడ్డి. రాష్ట్ర పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీకి సేవలందించి.. రాష్ట్రంలో బీజేపీని ఉన్నతస్థాయికి తీసుకువచ్చేందుకు కృషి చేసిన బండి సంజయ్‌కి కేంద్ర మంత్రివర్గం లేదా పార్టీ జాతీయ నాయకత్వంలో అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. మూడు నాలుగు రోజుల్లో అన్నిఅంశాలపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్. నేతల మధ్య విభేదాలు, బండి సంజయ్‌ మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడం వంటివి పరిగణననలోకి తీసుకుని.. ఎన్నికల దృష్ట్యా కిషన్‌ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడం సరైన చర్యగా భావించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news