Telangana: నేడు, రేపు రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

-

వరణుడు, సూర్యుడు ఒకేసారి తెలంగాణపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు వానలు కురుస్తున్నాయి. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలతోపాటు అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వడగళ్లు పడటంతో పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మరోవైపు 20 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 42.6 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏడున ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో… 8న ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news