బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ బృందం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లారు. డ్యాం సేఫ్టీ కోరకు పోలీసులు గేటు ముసివేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తలు గేటు తోసుకొని లోపలికి వచ్చారు. పోలీసులు వాళ్లని ఆపే ప్రయత్నం చేయగా, పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు హెచ్చరిస్తున్న వినకుండా కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు బ్యారేజీ వద్దకు వెళ్లి డ్యాంను పరిశీలించారు.
అనంతరం అన్నారం డ్యాం వద్దకు వెళ్లి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే మేడిగడ్డను పరిశీలించేందుకు ఇరిగేషన్ నిపుణులతో వచ్చామని, కాంగ్రెస్ నాయకులు 50 మీటర్లలో ఉన్న లోపాన్ని మొత్తం బ్యారేజీకే అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, రైతులపై కక్షపూరితంగా వ్యవహరించవద్దని మండిపడ్డారు. అంతేకాదు.. ఇరిగేషన్ నిపుణులతో వెంటనే కమిటీ వేసి, లోపాన్ని త్వరగా సరిదిద్ది రైతుల సాగుకు త్వరలోనే నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్.