వారు ఎవ్వరూ వచ్చినా వెంట్రుక కూడా పీకలేరు.. కొడాలి నాని హాట్ కామెంట్స్..!

-

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఒకవేళ పడమరన ఉదయించినా సరే.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు 5 కోట్ల ఆంధ్రుల ఆశీస్సులు జగన్ కు ఉన్నాయని, సూర్యుడు పడమరన ఉదయించినా సరే మే ఆఖరులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు.

అలా చేయకుండా ఆపగలిగే దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదని, భారత దేశంలో మంచి చేస్తే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగల్గిన ఏకైక సీఎం జగనే అని చెప్పారు. ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లమ్మతో పాటు సోనియా గాంధీ, మోడీ ఎవరు వచ్చిన జగన్ వెంట్రుక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలించిన 58 నెలల్లో కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా ఏరోజు కూడా ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఆపలేదని, అదే చంద్రబాబు అయితే కరోనా పేరు చెప్పి డబ్బులు లేవని పస్తులు పడుకోబెట్టేవాడని ఎద్దేవా చేశారు. అందుకే మనమందరం జగనన్నకు తోడుగా నీడగా ఉంటూ.. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని కార్యకర్తకు నిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news