కడియం శ్రీహరిని తరిమి తరిమి కొట్టాలి : తాటికొండ రాజయ్య

-

కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కడియం శ్రీహరి కేసీఆర్, కేటీఆర్ లపై రెచ్చిపోయి మాట్లాడుతుండు అని పేర్కొన తాటికొండ రాజయ్య.. గ్రామాలకు రాకుండా కడియం శ్రీహరిని తరిమి తరిమి కొట్టాలి అని ప్రజలకు సూచించారు. గ్రామ పొలిమేరల నుండే వెళ్ళగొట్టాలి. రైతులు, BRS నాయకులు, ఓట్లేసిన ప్రజలు అందరూ కడియంపై తిరగబడాలి అన్నారు.

ఇక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తన ఏజెండా ఏందో ప్రకటించాలి అని కడియంను డిమాండ్ చేసారు రాజయ్య. అయితే 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి.. తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడా అని ప్రశ్నించారు. ఇక పార్టీ ఫిరాయించిన 10 మందిలో ముగ్గురిపై మాత్రమే డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. మిగతా ఎమ్మెల్యేలు కుడిదిలో పడ్డ ఎలుకల్లాగా కొట్టుకుంటున్నారు. 10 మందిలో 9 మంది నిశ్శబ్దంగా ఉంటే.. ఒక కడియం శ్రీహరి మాత్రమే విమర్శలు చేస్తున్నారు అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news