ఏక‌గ్రీవం అయిన ఎమ్మెల్సీల‌ ప్ర‌మాణ స్వీకారం నేడే

తెలంగాణ రాష్ట్రం లో ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లలో అధికార పార్టీ కి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీ లు ఏక‌గ్రీవం గా ఎన్నిక అయ్యారు. ఏక గ్రీవం గా ఎన్నిక అయిన ఈ ఆరుగురు ఎమ్మెల్సీ లు నేడు శస‌న మండ‌లి లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రొటెం చైర్మెన్ గా ఉన్న వెన్న‌వ‌రం భూపాల్ రెడ్డి ఈ ఆరుగురి తో ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు.

ఈ రోజు ఉద‌యం 11 గంట‌లకు శస‌న మండ‌లి లో ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల‌లో క‌డియం శ్రీ‌హ‌రి, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, త‌క్కెళ్ల ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, బండ ప్ర‌కాశ్, పాడి కౌశిక్ రెడ్డి తో పాటు ప‌రుపాటి వెంక‌ట్రామిరెడ్డి ఉన్నారు. అయితే ఈ ఆరుగులో నుంచే శ‌స‌న మండ‌లి కి చైర్మెన్ ను ఎన్నుకునే అవ‌కాశం ఉంది. గుత్త సుఖేంద‌ర్ రెడ్డి వైపు గులాబి బాస్ మొగ్గు చూపే అవ‌కాశాలు ఉన్నాయి.