శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు : హరీశ్ రావు

-

శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు అని మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో తెలిపారు. తెలంగాణ కంటె ఎక్కువగా అప్పులు తీసుకున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయని వెల్లడించారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రతిష్ట పెంచాలి.. కానీ తగ్గించే ప్రయత్నం చేయకూడదు. గతంలో గ్యాస్ పై కేంద్రం సబ్సీడీ ఎత్తేసింది. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల తెలంగాణకు సుమారు రూ.లక్ష కోట్లు రాలేదని హరీశ్ రావు అసెంబ్లీలో తెలిపారు.

 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కాంగ్రెస్ ఏనాడు మాట్లాడలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించే విధంగా ఉంది. కాంగ్రెస్ ఇలాగే ఉంటే పెట్టుబడులు ఆగిపోతాయి. తెలంగాణ కంటే 22 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నాయి అని చెప్పారు.  తెలంగాణ కంటే ఎక్కువగా అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. వైద్యారోగ్యంపై ఆరు రెట్లు ఖర్చు పెంచామని తెలిపారు. కరోనా వల్ల అధికంగా అప్పులు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. గత ప్రభుత్వం ఏం చేయలేదనే తప్పుడు చూపిస్తున్నారు. రాష్ట్ర పరపతిని దెబ్బ తీయాలని చూస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news