కేంద్రం కుట్రతో రాష్ట్రాల ఎదుగుదలను అడ్డుకుంటుందని మండిపడ్డారు టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.కేంద్రంపై పోరు చేద్దామనే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యామనీ తెలిపారు.కానీ సభను గంటల కొద్ది వాయిదా వేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత సమావేశాల్లో ధాన్యం కొనగోళ్లపై కేంద్రాన్ని నిలదీశామనీ గుర్తు చేశారు.ఇప్పటికి కేంద్రంలోని నాయకులు ధాన్యం కొనగోళ్లపై ఇష్టారాజ్యంగా ఎవరికి వాళ్ళు ప్రకటిస్తున్నారనీ అన్నారు.కేంద్రం అనుమతులు ఇస్తేనే, రాష్ట్రం అప్పులు తీసుకుంటుందనీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందనీ తెలిపారు.
Frbm లిమిట్ ఎలా పెడతారు? అని ప్రశ్నంచారు.తీసుకున్న అప్పులుతెలంగాణ సరిగ్గా చెల్లిస్తుందన్నారు రంజిత్ రెడ్డి.కేంద్రం సైతం frbm లిమిట్ దాటిందనీ,తీసుకున్న అప్పులుతెలంగాణ సరిగ్గా చెల్లిస్తుందన్నారు.కేంద్రం విషపూరితమయిన కుట్రతో రాష్ట్రాల ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తుందన్నారు.తెలంగాణతో కయ్యానికి పోకుండా అభివృద్ధి కి కేంద్రం సహకరించాలనీ డిమాండ్ చేశారు.